తెలంగాణలో కరోనా ఉద్ధృతి... 209 కొత్త కేసులు, 9 మరణాలు

  • రాష్ట్రంలో 165కి చేరిన మృతుల సంఖ్య
  • జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 175 మందికి కరోనా
  • రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,320
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 209 కొత్త కేసులు వెలుగు చూశాయి. వీటిలో 208 లోకల్ కేసులు కాగా, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఒక కేసును గుర్తించారు. జీహెచ్ఎంసీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 మందికి కరోనా నిర్ధారణ అయింది. అంతేకాదు, రాష్ట్రంలో మరో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 165 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,320కి చేరింది. 1,993 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Telangana
Deaths
Corona Virus
Positive
GHMC
Hyderabad
COVID-19

More Telugu News